సిద్దిపేట, 2026-06-05
సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అప్పనపల్లిలో రోడ్డు పక్కన ఉన్న బావిలోకి కారు దూసుకెళ్లడంతో అందులో ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం పాలయ్యారు.
సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలో అర్ధరాత్రి తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అప్పనపల్లిలో రోడ్డు పక్కన ఉన్న బావిలోకి ఓ కారు దూసుకెళ్లడంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం పాలయ్యారు. మృతులను బలవంతపూర్ గ్రామానికి చెందిన భార్యాభర్తలు భాగ్య, రాజు, వారి కుమారుడు నియాన్, కుమార్తె శాన్వికగా పోలీసులు గుర్తించారు.
మృతదేహాల వెలికితీత
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. బావిలో నుంచి నలుగురి మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.












