కన్న ప్రేమను మరిచిన కర్కశులు శంషాబాద్లో హృదయ విదారక ఘటనకు పాల్పడ్డారు. పసికందును రోడ్డుపై అనాథలా వదిలేసి వెళ్లిన దుండగుల తీరు కలకలం రేపింది. రాళ్లగూడ ఇంద్రనగర్ రాజీవ్ గృహ సమీపంలో ఈ దారుణం చోటుచేసుకుంది. పాప ఏడుపుతోనే ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. స్థానికుల అప్రమత్తతతో శిశువు ప్రాణాపాయం తప్పింది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు శిశువును రక్షించి, కేసు నమోదు చేసుకున్నారు. నిందితుల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తును వేగవంతం చేశారు. పసికందును ఎవరు వదిలేశారనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన కీలక ఆధారాల కోసం దర్యాప్తు బృందాలు వేటాడుతున్నాయి.
శంషాబాద్లో పసికందును వదిలేసిన దుండగులు..
Share:

సారాంశం
పోలీసుల గాలింపు
ముఖ్య విషయాలు
- కన్న ప్రేమను మరిచిన కర్కశులు శంషాబాద్లో హృదయ విదారక ఘటనకు పాల్పడ్డారు.
- పసికందును రోడ్డుపై అనాథలా వదిలేసి వెళ్లిన దుండగుల తీరు కలకలం రేపింది.
- రాళ్లగూడ ఇంద్రనగర్ రాజీవ్ గృహ సమీపంలో ఈ దారుణం చోటుచేసుకుంది.
- పాప ఏడుపుతోనే ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
మీ అభిప్రాయం చెప్పండి
రచయిత గురించి

Barukunta Mahendher
Reporter
1539ఆర్టికల్స్
1,42,754వ్యూస్









