రంగారెడ్డి, జూలై 13
షాబాద్‌లో జరిగిన ఆరు హత్యల కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. విడాకులు కోరినందుకే నిందితుడు రాజ్‌కుమార్ తన భార్య, ఇద్దరు పిల్లలను హత్య చేసినట్లు సమాచారం. తన విచ్చలవిడి జీవితానికి అడ్డు వస్తుందనే కారణంతో భార్యను తొలగించుకోవాలని ముందు నుంచే ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది.
షాబాద్‌లో చోటుచేసుకున్న ఆరు హత్యల కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ దర్యాప్తులో పలు సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. విడాకులు ఇవ్వమని అడిగిందన్న కారణంతోనే నిందితుడు రాజ్‌కుమార్ తన భార్య, ఇద్దరు పిల్లలను హత్య చేసినట్లు సమాచారం. తన విచ్చలవిడి జీవితానికి అడ్డువస్తుందనే కారణంతో ఆమెను అడ్డు తొలగించుకునేందుకు ముందు నుంచే ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
రాజ్‌కుమార్, సరిత కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజ్‌కుమార్ ఇంటర్మీడియట్ చదివే సమయంలో సరిత దగ్గరకు ట్యూషన్ చెప్పించుకోవడానికి వెళ్లేవాడు. ప్రేమ పేరుతో ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. ఈ విషయం తెలుసుకున్న సరిత తల్లిదండ్రులు ఆమెకు పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. సరితను పెళ్లి చేసుకోవాలన్న ఉద్దేశంతో రాజ్‌కుమార్ వచ్చిన సంబంధాలను చెడగొట్టాడు. వయసులో తనకన్నా ఆరేళ్లు పెద్దదైన సరితను 2018లో పెళ్లి చేసుకున్నాడు.
డ్రైవింగ్ చేస్తూ జీవనం సాగిస్తున్న రాజ్‌కుమార్.. బెట్టింగులు, జూదం వంటి వ్యసనాలకు బానిస అయ్యాడు. దీనితో రెండు కోట్ల రూపాయల అప్పులు చేశాడు. అప్పుల బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాడు. చనిపోతానని బెదిరించటంతో అతడి తల్లిదండ్రులు కొంత పొలం అమ్మేసి అప్పులు తీర్చారు. ఆ తర్వాత తల్లిదండ్రులను నమ్మించి మొత్తం పొలం అమ్మేలా చేశాడు.
జల్సాలకు, మద్యానికి బానిసైన రాజ్‌కుమార్.. తరచూ మద్యం సేవించి సరితను వేధించేవాడు. రాజ్‌కుమార్ వేధింపులు తాళలేకపోయిన సరిత విడాకులు అడిగింది. దీంతో ఆమెపై పగ పెంచుకున్నాడు. శుక్రవారం రాత్రి సరితను, ఇద్దరు పిల్లలను హత్య చేశాడు.











