నిర్మల్ జిల్లా గాజులపేట్లోని సంతోషి మాత దేవాలయంలో వార్షికోత్సవ వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ నెల 1వ తేదీ నుండి ప్రారంభమైన ఉత్సవాల్లో భాగంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, హోమాలు జరుగుతున్నాయి.
ఆలయ సభ్యులు శేట్పల్లి సంతోష్, వందన, పతికే రమేష్, రాజుల దేవి రాజశేఖర్, జయశ్రీలు తెలిపిన వివరాల ప్రకారం, బ్రాహ్మణోత్తములచే వేద మంత్రోచ్చారణల మధ్య పూజా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.
యజ్ఞ కార్యక్రమంలో భాగంగా అనేక మంది మహిళలు, దంపతులు పాల్గొని పూజలు నిర్వహిస్తున్నారు.
భక్తులకు అన్నదానం కూడా ఏర్పాటు చేసి సేవలందిస్తున్నారు. ఈ వేడుకలకు పరిసర ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు.












