నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం మన్మద్ గ్రామంలో బుద్ధ పౌర్ణిమ సందర్భంగా బుద్ధ జయంతి వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు.
ఈ వేడుకల్లో పలువురు వక్తలు గౌతమ బుద్ధుని జీవితం, ఆయన బోధనలైన శాంతి, అహింస గురించి వివరించారు. సమాజంలో సత్సంప్రదాయాలను నెలకొల్పాలని పిలుపునిచ్చారు.
యువత బుద్ధుని ఆదర్శాలను అనుసరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లలిత భోజన్న, ఉపసర్పంచ్ గీతా భవాని, సాయిప్రసాద్, విడిసి ప్రెసిడెంట్ రాజలింగం, అంబేద్కర్ సంఘం సభ్యులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.












