కార్మికులకు చట్టబద్ధమైన కనీస వేతనాన్ని తక్షణమే అమలు చేయాలని, అది కేవలం పేదరికంలో జీవించే స్థాయికి కాకుండా, వారి నిజమైన అవసరాలను తీర్చేలా ఉండాలని ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా () రాష్ట్ర ఉపాధ్యక్షులు కట్ట రాజన్న డిమాండ్ చేశారు. జాతీయ కమిటీ పిలుపులో భాగంగా, నిర్మల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గాంధీ పార్క్ నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు కార్మికులతో ర్యాలీ నిర్వహించి, అనంతరం ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు.
అవసరాల ఆధారిత కనీస వేతనం
ఈ సందర్భంగా కట్ట రాజన్న మాట్లాడుతూ, కార్మికుల ప్రాథమిక అవసరాలను తీర్చడానికి, వారి ఆరోగ్యం, పని సామర్థ్యం, గౌరవాన్ని నిలబెట్టుకోవడానికి సరిపోయేలా కనీస వేతనం ఉండాలని అన్నారు. ప్రస్తుత నిత్యావసర ధరలకు అనుగుణంగా మే 2026 నాటికి నెలకు రూ.39,373/- ను అవసరాల ఆధారిత కనీస వేతనంగా నిర్ణయించిందని తెలిపారు. దీనినే కనీస వేతనంగా అమలు చేయాలని, ఆర్థిక ద్రవ్యోల్బణం నుండి కార్మికుల కొనుగోలు శక్తిని రక్షించడానికి తగిన వేరియబుల్ డ్యూటీ అలవెన్స్ () ను జోడించాలని ప్రతిపాదిస్తుందని పేర్కొన్నారు.
ప్రభుత్వానికి విజ్ఞప్తి
ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని, అవసరాల ఆధారిత కనీస వేతన సూత్రాన్ని నిజాయితీగా అమలు చేయాలని డిమాండ్ చేస్తుందని అన్నారు. కార్మికులు, వారి కుటుంబాల సంక్షేమం దృష్ట్యా ఈ అంశానికి తగిన, అత్యవసర ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన కోరారు.
పాల్గొన్న నాయకులు
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు . బక్కన్న, జిల్లా కార్యదర్శి . రామలక్ష్మణ్, జిల్లా ఉపాధ్యక్షులు .గంగన్న, సహాయ కార్యదర్శి .. గఫూర్, జిల్లా నాయకులు కె.లక్ష్మి, వి.గోదావరి, జిల్లా ప్రధాన కార్యదర్శి వి.మహేందర్, నాయకులు గంగామని, రవి, రేష్మా, లింగన్న, పోశెట్టి మరియు ఇతర కార్మికులు పాల్గొన్నారు.











