నిర్మల్ నియోజకవర్గాన్ని సమగ్ర పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని కాంగ్రెస్ ఇంచార్జి కుచాడి శ్రీహరి రావు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు జిల్లా ఇంచార్జి మంత్రి జూపల్లి కృష్ణారావును కలిసి పలు అభివృద్ధి పనులపై వినతిపత్రం సమర్పించారు.
వెంగ్వపేట గ్రామ చెరువును అభివృద్ధి చేసి, సాగునీటి అవసరాలతో పాటు పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దాలని విజ్ఞప్తి చేశారు.
మామడ మండలంలోని వాస్తపూర్ జలపాతాన్ని అధికారికంగా పర్యాటక కేంద్రంగా గుర్తించాలని కూడా కోరారు.
నిర్మల్ నియోజకవర్గానికి పర్యాటక గుర్తింపు కల్పించడం ద్వారా ప్రాంతీయ అభివృద్ధికి తోడ్పడాలని మంత్రిని కోరినట్లు శ్రీహరి రావు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ భీమ్ రెడ్డి మామడ, మాజీ జడ్పీటీసీ సంతోష్, వెంగ్వపేట మాజీ సర్పంచ్ రమేష్ కుమార్, జిల్లా కాంగ్రెస్ నాయకులు కొట్టే శేఖర్, నాయనగారి మురళి, అజయ్, రామారావు తదితరులు పాల్గొన్నారు.


