ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సమీక్ష (సర్)కు సంబంధించిన సన్నాహక పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం 22 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించింది.
కేంద్ర ఎన్నికల సంఘం గురువారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి దశ సర్ కార్యక్రమం ఏప్రిల్ నుండి ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
ఈ కార్యక్రమం పూర్తయితే అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో సర్ ప్రక్రియ పూర్తి అవుతుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఈ సమీక్షకు సిద్ధంగా ఉండాలని ఎన్నికల కమిషన్ సూచించింది.
ఈ ఆదేశాలు ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను క్రమబద్ధీకరించే దిశగా జారీ చేయబడ్డాయి. ఎన్నికల సంఘం ఈ ప్రక్రియను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది.


