హైదరాబాద్, 2026-06-05
నిర్మల్ జిల్లాలోని లక్ష్మణచందా మండలంలో పలు దేవాలయాల అభివృద్ధి పనులకు ు మంజూరు చేయాలని కోరుతూ కాంగ్రెస్ దేవాదాయ శాఖ ను కలిసి వినతి పత్రం సమర్పించారు. దీనికి ంగా స్పందించి త్వరలోనే ు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.
నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కూచాడి శ్రీహరి రావు గారి ఆధ్వర్యంలో లక్ష్మణచందా మండల నాయకులు హైదరాబాద్ లోని దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీ హనుమంతరావు గారిని కలిసి వినతి పత్రం సమర్పించారు. పలు దేవాలయాల అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని వారు కోరారు.
లక్ష్మణచందా మండల కేంద్రంలోని శ్రీ మార్కండేయ ఆలయ ప్రహరీ గోడ నిర్మాణానికి రూ. 14 లక్షలు, మునుపెల్లి గణపతి మందిరానికి ఫ్లోరింగ్, ప్రహరీ గోడ నిర్మాణానికి రూ. 15 లక్షలు, పారుపల్లి శ్రీకృష్ణ ఆశ్రమ ప్రహరీ గోడకు రూ. 23 లక్షలు, బాబాపూర్ మల్లన్న స్వామి ఆలయానికి రూ. 4 లక్షలు మంజూరు చేయాలని వినతి పత్రంలో పేర్కొన్నారు.
విజ్ఞప్తిని సానుకూలంగా స్వీకరించిన దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, త్వరలోనే నిధుల మంజూరుకు హామీ ఇచ్చారు. ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ రామిరెడ్డి, లక్ష్మణ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొండ్ర నరేష్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు ఈటెల శ్రీనివాస్, సీనియర్ నాయకులు అబ్బడి ప్రతాపరెడ్డి, సిరిపురం నాగేష్, బిట్లింగ్ రజనీకాంత్, గుర్రాల లింగారెడ్డి, మైనార్టీ మండల అధ్యక్షులు అస్గర్, ఠాకూర్ కిరణ్, తునికి నారాయణ, భీమేష్, సిరిపురం ఆనంద్, మంగళ్ పెళ్లి గంగాధర్, ఆలుగొట్టు నరేష్, గొల్ల మల్లేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.












