ఖానాపూర్, 2026-08-05
ఆంగ్ల భాషలో పీహెచ్డీ పట్టా పొందిన డాక్టర్ యు. రవికుమార్, అసిస్టెంట్ ప్రొఫెసర్, డిగ్రీ కళాశాల, బైంసాను ఆదివారం ఎస్టీయూ () టీఎస్ నిర్మల్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.
ఖానాపూర్, ఆగస్టు 5 (మనోరంజని తెలుగు టైమ్స్): ఆంగ్ల భాషలో పీహెచ్డీ పట్టా పొందిన డాక్టర్ యు. రవికుమార్, అసిస్టెంట్ ప్రొఫెసర్, డిగ్రీ కళాశాల, బైంసాను ఆదివారం ఎస్టీయూ () టీఎస్ నిర్మల్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎస్టీయూ నిర్మల్ జిల్లా అధ్యక్షులు ఎస్. భూమన్న యాదవ్, ప్రధాన కార్యదర్శి జె. లక్ష్మణ్, జిల్లా ఆర్థిక కార్యదర్శి బి. వెంకటేశ్వర్ రావు, జిల్లా బాధ్యులు ఎ. నాగభూషణ్ గార్ల బృందం ఆయనను ఆత్మీయంగా సత్కరించారు. పూర్వపు ఎస్టీయూ సభ్యులు, సంఘ హితవర్యులైన డాక్టర్ రవికుమార్ పీహెచ్డీ సాధించడం పట్ల నాయకులు అభినందనలు తెలిపారు.












