నిర్మల్, 2026-08-28
నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా రాఖీ పండగ (రక్షాబంధన్) సందర్భంగా జిల్లా ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు.
జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా రాఖీ పండగ (రక్షాబంధన్) సందర్భంగా ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ప్రేమానురాగాలు, ఆత్మీయతకు ప్రతీకగా నిలుస్తుందని, ప్రతి ఒక్కరూ ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు.
మహిళలకు రక్షణ, గౌరవం కల్పించాలనే బాధ్యతను ఈ పండుగ గుర్తుచేస్తుందని ఆయన తెలిపారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి పండుగను సంతోషంగా, ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఆయన కోరారు.
ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు, సిరిసంపదలు వెల్లివిరియాలని ఆకాంక్షిస్తూ, మరోసారి జిల్లా ప్రజలందరికీ ఆయన రాఖీ పండగ శుభాకాంక్షలు తెలిపారు.


