నేరడిగొండ, 2026-06-05
ేడగొండండేందంోేఠశణ,భదతణు,అుతుగణేతంగణదథేద()బోతోగంఇంతీషోు.తీదీంోఉఠశోదథుభదతఅధుుదృషంఆతేశు.
నేరడిగొండ మండల కేంద్రంలోని జ్ఞాన వికాస్ ప్రైవేట్ పాఠశాల నిర్వహణకు సంబంధించి విద్యాశాఖ నిబంధనల అమలు, భద్రతా ప్రమాణాలు మరియు అనుమతులపై సమగ్ర విచారణ చేపట్టాలని తెలంగాణ విద్యార్థి వేదిక () బోత్ నియోజకవర్గం ఇంచార్జ్ సతీష్ కోరారు.
జాతీయ రహదారి సమీపంలో భద్రతా ప్రమాణాలు
జాతీయ రహదారి -44కు అత్యంత సమీపంలో పాఠశాల నిర్వహిస్తున్న నేపథ్యంలో విద్యార్థుల భద్రతకు సంబంధించిన ప్రమాణాలు పాటిస్తున్నారా లేదా అనే విషయాన్ని సంబంధిత అధికారులు పరిశీలించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పాఠశాల నిర్వహణకు సంబంధించిన అన్ని అనుమతులు, గుర్తింపులు, మౌలిక సదుపాయాలు మరియు ప్రభుత్వ నిబంధనల అమలుపై పారదర్శక విచారణ జరపాలని కోరారు.
అధికారుల తీరుపై ఫిర్యాదు
మండల విద్యాశాఖ అధికారుల () వ్యవహార శైలిపై స్థానిక ప్రజలు, తల్లిదండ్రులు మరియు విద్యార్థి సంఘాల నుంచి వస్తున్న అభ్యంతరాలను జిల్లా విద్యాశాఖ అధికారులు, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాలని సతీష్ కోరారు.
ఏ అధికారి అయినా తన విధులను నిష్పక్షపాతంగా నిర్వహించాలని, ఒకవేళ విచారణలో అధికార దుర్వినియోగం, పక్షపాతం లేదా నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు తేలితే సంబంధిత అధికారులపై చట్టపరమైన మరియు శాఖాపరమైన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు.












