ముధోల్, 2026-06-05
రక్షా బంధన్ వేడుకల సందర్భంగా ముధోల్ నియోజకవర్గంలో ఆత్మీయ దృశ్యం ఆవిష్కృతమైంది. ఈ పండుగను పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్ గారి కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కమోల్ గ్రామానికి చెందిన శశికళ, మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్ గారికి రాఖీ కట్టి తమ సోదరభావాన్ని చాటుకున్నారు.
రక్షా బంధన్ వేడుకల సందర్భంగా ముధోల్ నియోజకవర్గంలో ఆత్మీయ దృశ్యం ఆవిష్కృతమైంది. ఈ పండుగను పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్ గారి కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కమోల్ గ్రామానికి చెందిన శశికళ, మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్ గారికి రాఖీ కట్టి తమ సోదరభావాన్ని చాటుకున్నారు. అనంతరం నారాయణరావు పటేల్ ఆమెను ఆశీర్వదించి, ప్రత్యేక కానుకను అందజేశారు.
ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు శంకర్ చంద్రే, ముధోల్ అసెంబ్లీ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు మహమ్మద్ షఫీ, నాయకులు గంగారెడ్డి, శ్యామ్ రావు, లోస్రా మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు నరేష్, స్వామి తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.











