మిర్యాలగూడ, జూలై 17
కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పారదర్శక పాలనలో భాగంగా, రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వినూత్న ఆలోచనతో రూపొందించిన భూముల రీ సర్వే కార్యక్రమాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (బి.ఎల్.ఆర్) పిలుపునిచ్చారు. ఈ సర్వే ద్వారా భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఆయన తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న పారదర్శక ప్రజా పాలనలో భాగంగా రెవిన్యూ సమస్యల పరిష్కారం కొరకు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వినూత్న ఆలోచనతో రూపొందించిన భూముల రీ సర్వేతో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తున్నందున రైతులు భూరీసర్వేకార్యక్రమాన్ని సద్వినియోగంచేసుకోవాలని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (బి.ఎల్.ఆర్) అన్నారు.
మిర్యాలగూడ నియోజకవర్గం లోని అడవిదేవులపల్లి మండలం ఉల్సాయిపాలెం, దామరచర్ల మండలం నర్సాపురం, మిర్యాలగూడ మండలం కిష్టాపురం, మాడుగులపల్లి మండలం గండ్రవానిగూడెం, వేములపల్లి మండలం తిమ్మారెడ్డి గూడెం గ్రామాలను భూ సర్వే కొరకు పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసినందున శుక్రవారం ఆయా గ్రామాలలో ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్, ఆర్డీవో ఎస్. రమణారెడ్డి తో కలిసి రైతులతో అవగాహన సదస్సులు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ భూ రీ- సర్వే కార్యక్రమం ద్వారా భూముల సరిహద్దులు స్పష్టంగా నిర్ణయించడంతోపాటు భూ రికార్డుల ఆధునీకీకరణ, భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం లభిస్తున్నందున ఈ ప్రక్రియకు పూర్తిస్థాయిలో రైతులు సహకరించాలన్నారు.
అనంతరం ఆర్డీవో రమణారెడ్డి మాట్లాడుతూ రైతుల భూ హక్కులను పరిరక్షించడంతోపాటు భవిష్యత్ తరాలకు భూ వివాద రహిత భూ రికార్డులు అందించడం ప్రభుత్వ లక్ష్యమని, సర్వే బృందాలకు రైతులు తమ వద్ద ఉన్న ఆధారాలతో సర్వే సమయంలో సహకరించాలన్నారు.
భూ రీ సర్వే నిర్వహణ విధానం, సాంకేతిక ప్రక్రియ, ప్రజలు పాటించవలసిన సూచనలపై గ్రామస్తులకు వివరించి, ఇలాంటి సందేహాలు ఉన్న రెవిన్యూ అధికారులను సంప్రదించాలన్నారు. నూతన సాంకేతికతో చేపట్టిన ఈ భూ సర్వేను రైతులు సద్వినియోగం చేసుకొని భూముల అమ్మకాలు, కొనుగోలు, రుణాలు తదితర సమయాలలో ఖచ్చితమైన రికార్డులను రెవిన్యూ అధికారులు అందుబాటులో ఉంచుతారన్నారు.
ఈ కార్యక్రమంలో తాసిల్దార్ శ్రీనివాస్, ఆర్ ఐ ఠాగూర్ రామకృష్ణ, ఆయా గ్రామాల సర్పంచులు, రెవెన్యూ అధికారులు, గ్రామ పాలన అధికారులు, రైతులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.












