కలాల వాడ, మిర్యాలగూడ, నల్గొండ, తెలంగాణ (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 06
మిర్యాలగూడ పట్టణంలోని కలాల వాడలో గల ప్రసిద్ధ ముత్యాలమ్మ తల్లి దేవాలయంలో శ్రావణమాసం సందర్భంగా ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, మాధవి దంపతులు అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించి, బోనం సమర్పించి, పట్టు వస్త్రాలను అందజేశారు. మున్సిపల్ చైర్ పర్సన్ చిలుకూరి సుధా బాలకృష్ణ కూడా బంగారు బోనం సమర్పించారు.
ఘనంగా ముత్యాలమ్మ తల్లికి బోనాల సమర్పణ : ఎమ్మెల్యే బిఎల్ఆర్ దంపతులు ప్రత్యేక పూజలు (మనోరంజని తెలుగు టైమ్స్) మిర్యాలగూడ పట్టణంలోని కలాల వాడలో గల ప్రసిద్ద ముత్యాలమ్మ తల్లి దేవాలయంలో శ్రావణమాసం సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి -మాధవి దంపతులు అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించి బోనం సమర్పించి, పట్టు వస్త్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రావణమాసంలో ముత్యాలమ్మ తల్లికి బోనం సమర్పించడం ఆనవాయితీగా వస్తున్న సంప్రదాయమని దీనిని ఆచరించి ప్రజలందరూ సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని అమ్మవారినిప్రార్థించినట్లు తెలిపారు. అదేవిధంగా స్థానిక మున్సిపల్ చైర్ పర్సన్ చిలుకూరి సుధా బాలకృష్ణ అమ్మవారికి బంగారు బోనం సమర్పించి ప్రత్యేక పూజలునిర్వహించారు. స్థానికంగా ప్రసిద్ధి చెందిన ఈ దేవాలయంలో శ్రావణమాసం ముగింపు సందర్భంగా జరిపే వేడుకల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారికి బోనం సమర్పించడంతో పాటు పూజలు నిర్వహించడంతో భక్తుల సందోహంతో కోలాహాలంగా మారి ఆధ్యాత్మికత ఉట్టిపడేలా పరిసర ప్రాంతాలు ఉన్నాయి. మహిళలందరూ సంప్రదాయ బద్ధంగా ఆకర్షనీయమైన వస్త్రాలతో డప్పు వాయిద్యాల మధ్య అమ్మవారికి బోనం సమర్పించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలోమున్సిపల్ వైస్ చైర్ పర్సన్ గుడిపాటి శిరీష నవీన్, ఆలయ కమిటీ అధ్యక్షులు కోల సైదులు ముదిరాజ్, బంటు సైదులు, 46 వార్డ్ కౌన్సిలర్ బంటు శ్రీనివాస్, బంటు వెంకటేశ్వర్లు, బంటు రమేష్ ముదిరాజ్, మురళి ముదిరాజ్, కోల శ్రీనివాస్,పలువురు కౌన్సిలర్లు,పార్టీ నాయకులు,తది తరులున్నారు.











