ఇటీవల జనసేన పార్టీలో చేరిన మీసాల ఫౌండేషన్ వ్యవస్థాపకులు మీసాల శ్రీనివాసరావును పీఆర్టీయూ తెలంగాణ జిల్లా గౌరవ అధ్యక్షులు కృపాల్ సింగ్ సోడి ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా కృపాల్ సింగ్ సోడి మాట్లాడుతూ, సమాజ సేవలో మీసాల శ్రీనివాసరావు అందిస్తున్న సేవలు అభినందనీయమని కొనియాడారు. ప్రజా సమస్యల పరిష్కారంతో పాటు సేవా కార్యక్రమాల్లో ఆయన మరింత ముందుండాలని ఆకాంక్షించారు.
సన్మానానికి స్పందించిన మీసాల శ్రీనివాసరావు, తనపై చూపిన అభిమానానికి కృపాల్ సింగ్ సోడికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ప్రజాసేవను మరింత బాధ్యతతో కొనసాగిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు జనసేన నాయకులు, ఉపాధ్యాయ సంఘ ప్రతినిధులు, అభిమానులు పాల్గొన్నారు.












