బోథ్ (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 31
బోథ్ మండల కేంద్రంలో జరిగిన ప్రత్యేక సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి భీంరావు పాటిల్ ను పార్టీ జిల్లా, నియోజకవర్గ నాయకత్వం ఘనంగా సన్మానించింది. పార్టీ కోసం పనిచేస్తే గుర్తింపు లభిస్తుందని ఈ సందర్భంగా నాయకులు ఉద్బోధించారు.
మండల కేంద్రంలోని సర్వాయి పాపన్న గౌడ్ సమావేశ మందిరంలో జరిగిన ప్రత్యేక సమావేశంలో భాగంగా, కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి భీంరావు పాటిల్ ను జిల్లా, నియోజకవర్గ అధినాయకత్వం ఘనంగా సన్మానించింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అన్ని విభాగాలను సమన్వయం చేసుకుంటూ పార్టీ కోసం పనిచేస్తే గుర్తింపు లభిస్తుందని గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్, ఉమ్మడి జిల్లా సర్వాయి పాపన్న గౌడ్ పరిశీలకులు మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్, మాజీ ఎంపీ సోయం బాపురావు, ఆదిలాబాద్ డిసిసి అధ్యక్షులు డాక్టర్ నరేష్ జాదవ్, బోథ్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ఆడే గజేందర్, జిల్లా అధికార ప్రతినిధి పసుల చంటి, జిల్లా పరిశీలకులు శ్రీధర్, డిసిసి కార్యదర్శి లోలపు పోశెట్టి, ఆత్మ చైర్మన్ రాజు యాదవ్, బోథ్ మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లెపూల సత్యనారాయణ, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గంగారెడ్డి, ఆదిలాబాద్ జిల్లా సహకార బ్యాంక్ చైర్మన్ అడ్డి బోజారెడ్డి, బోథ్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు గుడాల అనిష్, కాంగ్రెస్ పార్టీ బోథ్, సోనాల మండల అధ్యక్షులు మెరుగు భోజన్న, గాజుల పోతన్న, జిల్లా నాయకులు ఉమేష్, ఎస్సీ విభాగం బోథ్ అధ్యక్షుడు ఆశన్న, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు మునేశ్వర్, సోమన్న, జుంగల భోజన్న, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.











