హైదరాబాద్, 2026-08-16
గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు ముఖ్యమైన అప్డేట్. ఆధార్ ఆధారిత ఈ-కేవైసీని పూర్తి చేయనివారు వెంటనే అప్రమత్తం కావాలి. ఆగస్టు 16 లోపు ఈ-కేవైసీని పూర్తి చేయకపోతే, గృహావసరాల కోసం సబ్సిడీ ధరలకు ఎల్పీజీ సిలిండర్లను పొందే అర్హతను కోల్పోతారు.
ఆధార్ ఆధారిత ఈ-కేవైసీని పూర్తి చేయనివారు వెంటనే అప్రమత్తం కావాలి. ఆగస్టు 16 లోపు ఈ-కేవైసీని పూర్తి చేయకపోతే, గృహావసరాల కోసం సబ్సిడీ ధరలకు ఎల్పీజీ సిలిండర్లను పొందే అర్హతను కోల్పోతారు. ముఖ్యంగా ప్రధాన మంత్రి ఉజ్జ్వల యోజన () లబ్ధిదారులు సబ్సిడీని కోల్పోయే ప్రమాదం ఉంది.
ఆన్లైన్లోనే పూర్తి చేసే అవకాశం
గ్యాస్ ఏజెన్సీకి వెళ్లకుండానే, ఈ-కేవైసీని మీ మొబైల్ ఫోన్ ద్వారా ఆన్లైన్లోనే పూర్తి చేసుకునే సౌలభ్యం ఉంది. సంబంధిత గ్యాస్ కంపెనీ మొబైల్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని, ఆధార్ ఫేస్ఆర్డీ ( ) యాప్ సహాయంతో ఫేస్ స్కాన్ ద్వారా ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు.
ఏజెన్సీని సంప్రదించండి
ఒకవేళ ఆన్లైన్లో ఈ-కేవైసీ పూర్తి కాకపోతే, మీ సమీపంలోని గ్యాస్ ఏజెన్సీని సంప్రదించి, వీలైనంత త్వరగా ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవడం మంచిది.












