Nirmal/Lokeshwaram (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 12
లోకేశ్వరం మండల కేంద్రంలో ఆదివారం గంగనీల జాతర భక్తిశ్రద్ధల మధ్య వైభవంగా నిర్వహించారు. సంప్రదాయం ప్రకారం గంగనీయులు పవిత్ర గంగాజలాన్ని ఊరేగింపుగా తీసుకొచ్చి గ్రామదేవతలకు ప్రత్యేక అభిషేకాలు చేశారు. అనంతరం అమ్మవార్ల ఆభరణాలను గంగాజలంతో శుద్ధి చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
లోకేశ్వరం మండల కేంద్రంలో ఆదివారం గంగనీల జాతర భక్తిశ్రద్ధల మధ్య వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గంగాజలంతో గ్రామదేవతలకు అభిషేకాలు చేశారు. సంప్రదాయం ప్రకారం గంగనీయులు పవిత్ర గంగాజలాన్ని ఊరేగింపుగా తీసుకొచ్చి గ్రామదేవతలకు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. అనంతరం అమ్మవార్ల ఆభరణాలను గంగాజలంతో శుద్ధి చేసి ప్రత్యేక పూజలు చేశారు.
జాతర సందర్భంగా గ్రామ వీధులన్నీ భక్తులతో కిటకిటలాడాయి. డప్పు వాయిద్యాలు, భజనలు, మంగళహారతుల నడుమ గంగనీటి ఊరేగింపు ఆకట్టుకుంది. మహిళలు, యువకులు, ప్రజా ప్రతినిధులు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. మొక్కులు చెల్లించుకున్న భక్తులు గ్రామదేవతల ఆశీస్సులు పొందారు. సంప్రదాయ ఆచారాలను ప్రతిబింబించే గంగనీల జాతర లోకేశ్వరం గ్రామంలో కన్నులపండువగా సాగింది.












