లక్ష్మణ్చందా (మనోరంజని తెలుగు టైమ్స్) ఆగస్టు 13
లక్ష్మణ్చందా మాజీ సర్పంచ్ అట్లా రాంరెడ్డి అనారోగ్యంతో బాధపడుతున్నారని తెలిసి, నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కూచాడి శ్రీహరిరావు ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. రాంరెడ్డి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
లక్ష్మణ్చందా మాజీ సర్పంచ్ అట్లా రాంరెడ్డి అనారోగ్యంతో బాధపడుతున్నారని తెలిసి, నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కూచాడి శ్రీహరిరావు ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. రాంరెడ్డి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న శ్రీహరిరావు, ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో పాల్గొన్నవారు
ఈ పరామర్శ కార్యక్రమంలో నిర్మల్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఈటల శ్రీనివాస్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొండ్రు నరేశ్‌రెడ్డి, లక్ష్మణ్చందా ఉపసర్పంచ్, మైనార్టీ అధ్యక్షులు అస్గర్, గురుదల లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మాజీ సర్పంచ్ అట్లా రాంరెడ్డి త్వరగా కోలుకోవాలని అందరూ ఆకాంక్షించారు.












