లక్ష్మణ చందా (మనోరంజని తెలుగు టైమ్స్) ఆగస్టు 21
లక్ష్మణ చందా మండల కేంద్రంలో స్థానిక ఓస కవిత రాజు ఆధ్వర్యంలో తడి, పొడి చెత్త బుట్టల పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమం ద్వారా ప్రజలకు కల్పించారు.
లక్ష్మణ చందా మండల కేంద్రంలో స్థానిక సర్పంచ్ ఓస కవిత రాజు ఆధ్వర్యంలో తడి, పొడి చెత్త బుట్టల పంపిణీ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా సర్పంచ్ కవిత రాజు మాట్లాడుతూ, పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. తడి, పొడి చెత్తను వేరు చేసి, నిర్దేశించిన బుట్టలలో వేయడం ద్వారా పారిశుద్ధ్యాన్ని కాపాడవచ్చని తెలిపారు. ప్రజల భాగస్వామ్యంతోనే గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవచ్చని ఆమె సూచించారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ లక్కల వర్ష రవి, వార్డు సభ్యులు వనజ సంతోష్, అరటి రాజేశ్వర్, పత్తిపాక వెంకటరమణ, సిర్రా లింగన్న, కె. శ్రీనివాస్ రావు, బెజ్జంకి రజినీకాంత్, గుడ్ల సంధ్య రంజిత్, కార్యదర్శి సుధాకర్ పాల్గొన్నారు.












