ప్రభుత్వ ఆదేశాల మేరకు కుంటాల మండల కేంద్రంలో సోమవారం ఇంటింటా జనగణన సర్వేను లాంఛనంగా ప్రారంభించారు. గ్రామ సర్పంచ్ జక్కుల గజేందర్ సమక్షంలో ఉపాధ్యాయులు, అధికారులు ఈ ప్రక్రియను చేపట్టారు.
గ్రామ సర్పంచ్ జక్కుల గజేందర్ మాట్లాడుతూ, గ్రామాభివృద్ధికి, సంక్షేమ పథకాల పంపిణీకి ఖచ్చితమైన గణాంకాలు అవసరమని, ప్రజలు తమ పూర్తి వివరాలను అందించి సర్వేను విజయవంతం చేయాలని కోరారు.
ఈ సర్వే కోసం ప్రత్యేకంగా నియమితులైన ఉపాధ్యాయులు ప్రతి ఇంటిని సందర్శించి, కుటుంబ సభ్యుల సంఖ్య, సామాజిక, ఆర్థిక స్థితిగతులు మరియు విద్యా అర్హతలను నమోదు చేస్తున్నారు. ప్రజలు ఎటువంటి భయాందోళనలు చెందకుండా వాస్తవాలను తెలియజేయాలని, దీనివల్ల భవిష్యత్తులో ప్రభుత్వ ప్రయోజనాలు నేరుగా చేరే అవకాశం ఉంటుందని అధికారులు వివరించారు.
ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రాజబాపు, ఉపాధ్యాయ బృందాలు మరియు గ్రామ సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. సర్వే ప్రక్రియ పారదర్శకంగా సాగేలా చర్యలు తీసుకుంటున్నామని, ప్రజలు నమోదు సమయంలో తగిన పత్రాలను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు.












