ఖానాపూర్, జూలై 23
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు (కేటీఆర్) జన్మదినాన్ని పురస్కరించుకుని ఖానాపూర్ పట్టణంలో శుక్రవారం (జూలై 24) పలు సేవా కార్యక్రమాలను నిర్వహించనున్నారు. బీఆర్ఎస్ పార్టీ మండల, పట్టణ శాఖలు ఈ కార్యక్రమాలను ప్రకటించాయి.
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు (కేటీఆర్) జన్మదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం (జూలై 24) ఖానాపూర్ పట్టణంలో ప్రత్యేక సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు బీఆర్ఎస్ పార్టీ మండల, పట్టణ శాఖలు ప్రకటించాయి.
ఉదయం 9.30 గంటలకు ఖానాపూర్ పట్టణంలోని శ్రీ వీరాంజనేయ శివ సాయి సమాజ్ జంగల్ హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేయనున్నారు.
ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ భూక్యా జాన్సన్ నాయక్ ఆదేశాల మేరకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాల ప్రతినిధులు, మీడియా ప్రతినిధులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బీఆర్ఎస్ పార్టీ మండల, పట్టణ శాఖలు కోరాయి.











