Nirmal/Lokeshwaram (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 03
లోకేశ్వరం మండలం కిష్టాపూర్ గ్రామపంచాయతీలో జరుగుతున్న అభివృద్ధి పనులను మండల పంచాయతీ అధికారి (ఎంపీఓ) సల్మాన్ రాజ్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్రామంలోని నర్సరీ, వీవో భవనం నిర్మాణం, డ్రైనేజ్ వ్యవస్థ, పంచాయతీ కార్యాలయం రికార్డులను పరిశీలించారు.
లోకేశ్వరం మండలం కిష్టాపూర్ గ్రామపంచాయతిలో మండల పంచాయతీ అధికారి (ఎంపీఓ) సల్మాన్ రాజ్ శుక్రవారం ఆకస్మికంగా పర్యటించి గ్రామంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను పరిశీలించారు.
ముందుగా గ్రామ నర్సరీని సందర్శించి మొక్కల సంరక్షణ, నిర్వహణ తీరును పరిశీలించారు. అనంతరం గ్రామంలోని వీవో (V.O.) భవనం నిర్మాణ పనులు మరియు డ్రైనేజ్ వ్యవస్థను పరిశీలించి పనుల నాణ్యత, పురోగతిపై అధికారులకు పలు సూచనలు చేశారు. పనులు నాణ్యతతో పాటు నిర్ణీత గడువులో పూర్తి చేయాలని ఆదేశించారు.
తదుపరి గ్రామపంచాయతీ కార్యాలయాన్ని సందర్శించిన ఎంపీఓ, పంచాయతీ నిర్వహణకు సంబంధించిన వివిధ రికార్డులు, ఫైళ్లను తనిఖీ చేశారు. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు అన్ని రికార్డులను ఎప్పటికప్పుడు నవీకరించాలని, గ్రామ అభివృద్ధి కార్యక్రమాల అమలులో నిర్లక్ష్యం లేకుండా పని చేయాలని అధికారులకు సూచించారు.
ఈ సందర్భంగా గ్రామంలో పారిశుద్ధ్యం, డ్రైనేజీల నిర్వహణ, ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దోమల భోజన్న, పంచాయతీ కార్యదర్శి శైలజ, ఫీల్డ్ అసిస్టెంట్ అంబకంటి శ్రీనివాస్, ఆశా వర్కర్.సాయరెడ్డి, శ్రీధర్ రెడ్డి, మహేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.












