ఖానాపూర్, 2026-06-05
ఖూోఏదోదోఉోఆదోళద
ఖానాపూర్ పట్టణంలోని ప్రధాన ప్రాంతంలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహం ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకుని, విరిగిపోయే దశలో ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విగ్రహంలోని పలు భాగాలు ఇప్పటికే దెబ్బతినగా, పాదాల వద్ద ఉన్న పీఠం కూడా బలహీనంగా కనిపిస్తోంది. దీంతో ఎప్పుడు ప్రమాదం జరుగుతుందోనని ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.
ఆత్మగౌరవానికి ప్రతీక
తెలంగాణ తల్లి విగ్రహం తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం, సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా ప్రభుత్వం పేర్కొంటున్న నేపథ్యంలో, ఇలాంటి పరిస్థితిలో విగ్రహం ఉండటం బాధాకరమని స్థానికులు అభిప్రాయపడుతున్నారు..
తక్షణ మరమ్మతులు డిమాండ్
సంబంధిత అధికారులు వెంటనే స్పందించి విగ్రహాన్ని పరిశీలించి, అవసరమైన మరమ్మతులు చేపట్టి భద్రంగా పునరుద్ధరించాలని స్థానికులు కోరుతున్నారు. విగ్రహానికి మరింత నష్టం జరగకముందే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంలో తక్షణమే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.












