కరీంనగర్, 2026-06-05
కాళేశ్వరం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, మంత్రులకు కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా విమర్శించారు. ప్రజల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వానికి వస్తున్న వ్యతిరేకత నుంచి తప్పించుకునేందుకే కాంగ్రెస్ నాయకులు దొంగనాటకాలు ఆడుతున్నారని ఆరోపించారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, మంత్రులకు కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా విమర్శించారు. ప్రజల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వానికి వస్తున్న వ్యతిరేకత నుంచి తప్పించుకునేందుకే కాంగ్రెస్ నాయకులు దొంగనాటకాలు ఆడుతున్నారని ఆరోపించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కాళేశ్వరం లింక్ 2లోని పంప్ హౌస్‌ల సందర్శనకు వెళ్లిన బీఆర్ఎస్ నాయకులు, కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. స్థానిక మంత్రిగా ఉన్న అడ్లూరి లక్ష్మణ్ తెలిసి తెలియని మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
పంప్ హౌస్‌ల సందర్శన
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్ట్ లింక్ 2లో ఉన్న పంప్ హౌస్‌ల సందర్శన కార్యక్రమాన్ని బీఆర్ఎస్ నాయకత్వం నిర్వహించింది. ఈ సందర్శనకు మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్ రమణతో సహా బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి, మైత్రి గ్రూప్స్ చైర్మన్ కొత్త జయపాల్ రెడ్డి వెళ్లారు. మొదటగా జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం కోటిలింగాలలోని కోటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి, ఎల్లంపల్లి బ్యాక్ వాటర్స్‌ను పరిశీలించారు. ఆ తర్వాత పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రానికి చేరుకున్న వారికి స్థానిక బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలుకగా, అక్కడి నుంచి నందిమేడారంలోని కాళేశ్వరం ప్రాజెక్ట్ ఆరో ప్యాకేజీ డెలివరీ సిస్టమ్‌ను సందర్శించారు. ఎల్లంపల్లి నుంచి నంది పంప్ హౌస్‌కు వస్తున్న గోదావరి జలాలకు పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడి నుంచి కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్ లోని గాయత్రీ పంప్ హౌస్‌కు చేరుకుని, డెలివరీ సిస్టమ్ వద్ద నుంచి వస్తున్న జలాలను పరిశీలించారు.
కాంగ్రెస్ నాయకులపై విమర్శలు
సీఎం రేవంత్ రెడ్డికి, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి కాళేశ్వరం ప్రాజెక్టుపై పూర్తి అవగాహన లేదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్సీ ఎల్ రమణ అన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ నాయకులు, కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే అక్కడ ఉన్న గుడి మాత్రమే అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ కీర్తి ప్రతిష్టలను దెబ్బతీసేందుకే, కాంగ్రెస్ నాయకులు కుట్రపూరితంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు.
స్థానిక మంత్రిపై ఆరోపణలు
ఉమ్మడి కరీంనగర్ జిల్లా మంత్రిగా ఉన్న అడ్లూరి లక్ష్మణ్, కనీస అవగాహన లేకుండా, గ్రావిటీ ద్వారా నీళ్లు వచ్చేవని మాట్లాడటం విడ్డురంగా ఉందని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన సాంకేతిక అంశాలపై అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ నాయకులు విమర్శించారు. ప్రాజెక్టు నిర్మాణంలో బీఆర్ఎస్ ప్రభుత్వ కృషిని, ఇంజనీర్ల ప్రతిభను గుర్తించకుండా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.












