మిర్యాలగూడ, 2026-08-06
తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్, ప్రజా యుద్ధనౌక గద్దర్ లకు గురువారం మిర్యాలగూడలోని గ్రంథాలయం, శాంతినికేతన్ డిగ్రీ కళాశాలలో ఘనంగా నివాళులు అర్పించారు.
తెలంగాణకై తన జీవితాన్ని అంకితం చేసిన సిద్ధాంతకర్త జయశంకర్ అని, తన గళం ద్వారా తెలంగాణ ఉద్యమానికి ఊపిరి లూదిన యుద్ధనౌక గద్దర్ అని గ్రంథాల ఉద్యమ నాయకులు కస్తూరి ప్రభాకర్, సామాజికవేత్త డాక్టర్ రాజు అన్నారు.
గురువారం స్థానిక మిర్యాలగూడలోని గ్రంథాలయంలో, శాంతినికేతన్ డిగ్రీ కళాశాలలో ఘనంగా నివాళులు అర్పించారు.
జయశంకర్, గద్దర్ ల స్మృతి
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, విద్యార్థులు ప్రతి ఒక్కరూ జయశంకర్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలని, తెలంగాణకు దశ దిశను చూపిన గొప్ప వ్యక్తి అని, సామాజిక గీతాల ద్వారా ప్రజల్లో చైతన్య నింపిన గొప్ప కళాకారులు గద్దర్ అని కొనియాడారు.
పాల్గొన్నవారు
కార్యక్రమంలో లైబ్రేరియన్ సుధాకర్, జన విజ్ఞాన వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కందుకూరి సుదర్శన్, బీసీ జేఏసీ కో కన్వీనర్ చేగొండి మురళి యాదవ్, దాసరాజు జయరాజు, అధ్యాపకులు కోల శ్రీనివాస్, సంతోష్ శ్రావణ్, మంద లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.












