కామారెడ్డి, 2026-08-06
మగ్గం మోగితే మన సంస్కృతి మేల్కొంటుంది, కానీ ఆ ఇంట్లో నవ్వులు మోగడం లేదు. నూలు కదిలితే నవభారత కీర్తి ముందుకు సాగుతోంది, కానీ ఆ కుటుంబం బతుకు ముందుకు సాగడం లేదు. చెమటను అద్భుత డిజైన్లతో చీరలో మలిచిన నేతన్న, కన్నీటిని కనురెప్పల మాటున దాచుకుంటున్నాడు.
మగ్గం మోగితే మన సంస్కృతి మేల్కొంటుంది, కానీ ఆ ఇంట్లో నవ్వులు మోగడం లేదు. నూలు కదిలితే నవభారత కీర్తి ముందుకు సాగుతోంది, కానీ ఆ కుటుంబం బతుకు ముందుకు సాగడం లేదు. చెమటను అద్భుత డిజైన్లతో చీరలో మలిచిన నేతన్న, కన్నీటిని కనురెప్పల మాటున దాచుకుంటున్నాడు. అతడు అల్లిన పట్టు చీరలు ఉన్నవారి ఇంట పసిడి నవ్వులు పూయిస్తుంటే, తన ఇంట మాత్రం చినిగిన చీర దర్శనమిస్తున్నది.
కళకు తగ్గ ప్రతిఫలం కరువు
దేశం అతని కళను కొనియాడుతుంది, కానీ కళకు తగిన ప్రతిఫలం లేక అన్నం గిన్నె అటుకులతోనే సరిపెట్టుకోవాల్సి వస్తున్నది. అతడు అల్లిన చీరకు కరతాళ ధ్వనులు వినిపిస్తున్నా, అతని కూతురి పెళ్లి అప్పుల ముసుగులోనే ఆగిపోయింది. కళను కాపాడిన కర్మయోగి నేతన్న, కలలను నేసిన కవియోగి నేతన్న.
నేతన్నను కాపాడుకుందాం
అందుకే నేతన్నను కాపాడుకుందాం, జాతీయ చేనేత దినోత్సవాన్ని గర్వంగా జరుపుదాం.












