హకీంపేట్ ఎడ్యుకేషన్ హబ్ పనుల పురోగతిని పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి , రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హకీంపేట్ ఎడ్యుకేషన్ హబ్ నిర్మాణ పనుల పురోగతిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించారు. వికారాబాద్ జిల్లా మండలం హకీంపేట్‌కు చేరుకున్న ముఖ్యమంత్రి.. ఎడ్యుకేషన్ హబ్‌లో నిర్మాణంలో ఉన్న వివిధ విద్యా సంస్థల భవన సముదాయాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఎడ్యుకేషన్ హబ్‌లో భాగంగా నిర్మిస్తున్న ప్రభుత్వ వైద్య కళాశాల, వెటర్నరీ, నర్సింగ్, ఫిజియోథెరపీ, పారామెడికల్, ఇంజనీరింగ్ కళాశాలలతో పాటు 400 పడకల ఆసుపత్రి నిర్మాణ పనులను సీఎం పరిశీలించారు. అలాగే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ భవనాలు, హాస్టళ్ల నిర్మాణాల పురోగతిని కూడా సమీక్షించారు. నిర్మాణ పనులన్నింటిలో సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సీఎం సూచించారు. భవన నిర్మాణాల్లో నాణ్యతా ప్రమాణాలు, సాంకేతిక అంశాలపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వర్షాకాలంలో ఎడ్యుకేషన్ హబ్ ప్రాంగణంలో నీరు నిల్వ ఉండకుండా వాటర్ హార్వెస్టింగ్ వెల్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. వర్షపు నీటిని ఒడిసిపట్టి భవిష్యత్తులో ల్యాండ్‌స్కేపింగ్ పనులకు వినియోగించేలా సమగ్ర ప్రణాళిక రూపొందించాలని అధికారులకు తెలిపారు. అనంతరం నియోజకవర్గంలో కొనసాగుతున్న వివిధ అభివృద్ధి పనులపై ముఖ్యమంత్రి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.
హకీంపేట్ ఎడ్యుకేషన్ హబ్ పనుల పురోగతిని పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి
Share:

సారాంశం

ముఖ్య విషయాలు
- ఎడ్యుకేషన్ హబ్‌లో భాగంగా నిర్మిస్తున్న ప్రభుత్వ వైద్య కళాశాల, వెటర్నరీ, నర్సింగ్, ఫిజియోథెరపీ, పారామెడికల్, ఇంజనీరింగ్ కళాశాలలతో పాటు 400 పడకల ఆసుపత్రి నిర్మాణ పనులను సీఎం పరిశీలించారు.
- ఎడ్యుకేషన్ హబ్‌లో నిర్మాణంలో ఉన్న వివిధ విద్యా సంస్థల భవన సముదాయాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
- అలాగే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ భవనాలు, హాస్టళ్ల నిర్మాణాల పురోగతిని కూడా సమీక్షించారు.
- నిర్మాణ పనులన్నింటిలో సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సీఎం సూచించారు.
మీ అభిప్రాయం చెప్పండి
రచయిత గురించి

madhav rao patel
Reporter
3309ఆర్టికల్స్
4,07,224వ్యూస్