ముధోల్, జూలై 8
ముధోల్ మండలంలోని రువ్వి గ్రామ సర్పంచ్ నక్క మల్లేష్ అనారోగ్యంతో మృతి చెందడంతో, ఆయన కుటుంబ సభ్యులను మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి బుధవారం పరామర్శించారు. మృతుని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ముధోల్ మండలంలోని రువ్వి గ్రామ సర్పంచ్ నక్క మల్లేష్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి బుధవారం మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన ఆయన, కష్టకాలంలో ధైర్యంగా ఉండాలని, అధైర్యపడవద్దని సూచించారు. నక్క మల్లేష్ మరణం గ్రామానికి తీరని లోటని, గ్రామాభివృద్ధికి సేవ చేయాలనే సంకల్పంతో పనిచేసిన నాయకుడి అకాల మరణం బాధాకరమని పేర్కొన్నారు. తమ వంతు సహాయ సహకారాలు కుటుంబానికి ఎల్లప్పుడూ ఉంటాయని భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ సురేందర్‌రెడ్డి, రువ్వి మాజీ సర్పంచ్ గౌతమ్, మండల నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.










