ఎఫ్.సి.ఐ. హమాలీ వర్కర్స్ యూనియన్ నాన్ డీపిఎస్ మిర్యాలగూడ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ ఎన్నికలు స్థానిక ఎన్ఎస్పి గెస్ట్ హౌస్ లో గురువారం జరిగాయి.
ఐఎన్టియూసి జిల్లా అధ్యక్షులు అంబటి సోమయ్య ఈ సందర్భంగా మాట్లాడుతూ, కార్మిక సమస్యల పరిష్కారం కోసం ఐఎన్టియూసి కృషి చేస్తుందని తెలిపారు. కార్మికులు తమ హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. ఐఎన్టియూసి కార్మికులకు అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు.
నూతన కార్యవర్గంలో అధ్యక్షులుగా జి. విజయ్, ఉపాధ్యక్షులుగా డి. రాందాస్, ప్రధాన కార్యదర్శిగా ఎం. పాండు, కోశాధికారిగా ఎం. బాలోజీ, కార్యదర్శిగా సైదులు, సహాయ కార్యదర్శిగా రమేష్, ప్రచార కార్యదర్శిగా నాగు ఎన్నికయ్యారు.
గౌరవ సలహాదారుడిగా అంబటి సోమయ్య, ముఖ్య సలహాదారుడిగా సజ్జల రవీందర్ రెడ్డి, సలహాదారులుగా పరికే వెంకటేశ్వర్లు మరియు సునీత భీమ్లా నాయక్ వ్యవహరించనున్నారు.











