మెండోరా (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 25
మెండోరా మండలంలోని దూదిగాం గ్రామంలో సర్పంచ్ హరోన్ రషీద్ బాబా ఆధ్వర్యంలో ఇంటింటికీ మొక్కల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, ప్రతి ఇంటి యజమాని మొక్కలను సంరక్షించి పెంచాలని, తద్వారా స్వచ్ఛమైన గాలి, ఆహ్లాదకరమైన వాతావరణం లభిస్తుందని తెలిపారు.
మెండోరా మండలంలోని దూదిగాం గ్రామంలో సర్పంచ్ హరోన్ రషీద్ బాబా, వార్డు సభ్యుల సమక్షంలో ఇంటింటికీ మొక్కలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. ప్రతి ఇంటి యజమాని పంపిణీ చేసిన మొక్కలను సంరక్షించి పెంచాలని సూచించారు. మొక్కలు పెరిగిన తర్వాత వాటి ద్వారా స్వచ్ఛమైన గాలి, ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు అనేక ప్రయోజనాలు పొందవచ్చని తెలిపారు.
అనంతరం సర్పంచ్ హరోన్ రషీద్ బాబా జన్మదినాన్ని పురస్కరించుకుని గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు. ప్రతిరోజూ తన వంతు బాధ్యతగా మొక్కలకు నీరు పోసి సంరక్షిస్తానని తెలిపారు. అనంతరం వార్డు సభ్యుల సహకారంతో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఐల్ శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్, వార్డు సభ్యులు, మహిళా సంఘాల సభ్యులు, విలేజ్ డెవలప్మెంట్ కమిటీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.












