మెండోరా (మనోరంజని తెలుగు టైమ్స్) ఆగస్టు 23
వంద సంవత్సరాల చరిత్ర కలిగిన మెండోరా మండలం పరిధిలోని దూదిగాం సిఎస్ఐ చర్చిని జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం గ్రామ సిఎస్ఐ చర్చి సంఘ స్త్రీల మైత్రి సమాజం సభ్యులు సందర్శించారు. ఈ సందర్భంగా వారు చర్చి ప్రాంగణంలో ఉన్న పాఠశాల, వైద్యశాలలను కూడా సందర్శించి, దూదిగాం గ్రామం తో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.
వంద సంవత్సరాల చరిత్ర కలిగిన మెండోరా మండలం పరిధిలోని దూదిగాం సిఎస్ఐ చర్చిని జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం గ్రామ సిఎస్ఐ చర్చి సంఘ స్త్రీల మైత్రి సమాజం సభ్యులు సందర్శించారు. ఈ సందర్భంగా వారు చర్చి ప్రాంగణంలో ఉన్న పాఠశాల, వైద్యశాలలను కూడా సందర్శించి, దూదిగాం గ్రామం తో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. సందర్శించిన వారిలో కొందరు అదే వైద్యశాలలో జన్మించడం విశేషం.
మిషన్ కాంపౌండ్ విశిష్టత
దూదిగాం మిషన్ కాంపౌండ్ లో ఉన్న ప్రతి విద్య, వైద్య వసతి గృహం, దేవాలయం యొక్క గొప్పతనాన్ని వారు ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. చర్చి సందర్శన అనంతరం, వారు సమీపాన ఉన్న మాదాపూర్ లోని చర్చిని, పోచంపాడు ప్రాజెక్టు అందాలను తిలకించారు. దూదిగాం చర్చి ఆవరణలో వనభోజనాలు నిర్వహించుకుని ఆనందం వ్యక్తం చేశారు.
ప్రత్యేక ప్రార్థనలు
ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల గురువులు రేవ.కే. కమలాకర్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఇబ్రహీంపట్నం సిఎస్ఐ ఇంచార్జీ రేవ. డి. ఆనందం, ఎవాంజెలిస్ట్ సందీప్, పప్పి రాణి, సెక్రెటరీ కే. ప్రమోద్, గంగారెడ్డి, అమృతరాజ్ తదితరులు పాల్గొన్నారు.











