దిలాల్పూర్ (మనోరంజని తెలుగు టైమ్స్) ఆగస్టు 28
దిలాల్పూర్ మండలంలో విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా జరిగిన ప్రమాదంలో ఇద్దరు రైతులకు చెందిన మేకలు మృతి చెందాయి. ఈ ఘటనలో సుమారు రెండు లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు బాధితులు తెలిపారు.
దిలాల్పూర్ మండలం శ్రీ కాల్వ నరసింహ స్వామి దేవస్థానం వెనుక భాగంలో, అటవీ ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న విద్యుత్ తీగలు వర్షానికి తెగిపడ్డాయి. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా, కాల్వ గ్రామానికి చెందిన కురుమ దేవన్న, ఫ్ నడిపి సాయన్నలకు చెందిన మేకపోతు, మేకలు విద్యుత్ షాక్కు గురయ్యాయి. ఈ ఘటనలో దాదాపు 35,000 విలువైన ఒక మేకపోతు, 20,000 విలువైన మరో మేక మరణించాయి. మొత్తం సుమారు రెండు లక్షల వరకు నష్టం జరిగిందని కురుమ దేవన్న వాపోయారు.
విద్యుత్ లైన్మెన్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని, బాధితులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని వారు వేడుకుంటున్నారు.












