లక్ష్మణచాంద, 2026-08-11
శ.బతతశఘెఈజశ.
లక్ష్మణ్ చందా మండల కేంద్రంలోని ధర్మారం అంగన్వాడి కేంద్రంలో మంగళవారం రోజున సూపర్వైజర్ ప్రసన్నకుమారి ఆధ్వర్యంలో చిన్నారులకు గ్రామ సర్పంచ్ బుర్కముత్యం మరియు పంచాయతీ కార్యదర్శి మేఘన రెడ్డి చేతుల మీదుగా యూనిఫాములు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ బుర్కముత్యం మాట్లాడుతూ అంగన్వాడి కేంద్రాల్లో చదువుకునే పిల్లలు చదువులో రాణించి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. అదేవిధంగా పంచాయతీ కార్యదర్శి మేఘన రెడ్డి మాట్లాడుతూ తల్లిదండ్రులు పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, టీవీ, సెల్ ఫోన్ కు దూరంగా ఉంచి విద్యపై మక్కువ పెంచాలని, అప్పుడే పిల్లలు చెడు మార్గాల వైపు వెళ్లకుండా ఉన్నతంగా ఉంటారని తెలిపారు.
అంగన్వాడి సెంటర్లలో పిల్లలకు పోషక విలువలతో కూడిన ఆహారం అందించాలని సూపర్వైజర్ ప్రసన్నకుమారి అంగన్వాడి శ్రీ గీతాకు సూచించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కళ్యాణి, ఆయా మమత, చిన్నారులు, సాయి మౌన, శిల్పరాణి, రేణుక, రజిని, తిరుమల, పుష్ప, తల్లిదండ్రులు పాల్గొన్నారు.










