హైదరాబాద్, 2026-06-05
రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాను సమర్థవంతంగా వినియోగించుకుంటున్న నేపథ్యంలో, దానికి ధీటుగా కాంగ్రెస్ పార్టీ కూడా పనిచేయాలని ముఖ్యమంత్రి రేవంత్ సూచించారు. యువత ఎక్కువగా ఇన్‌స్టాగ్రామ్‌లో క్రియాశీలకంగా ఉంటున్నారని, ఫేస్బుక్, ట్విట్టర్ వంటివి పాతబడిపోతున్నాయని ఆయన అన్నారు.
బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాను సమర్థవంతంగా వినియోగించుకుంటుందని, దానికి ధీటుగా కాంగ్రెస్ పార్టీ కూడా పనిచేయాలని సీఎం రేవంత్ సూచించారు. యువత ఎక్కువగా ఇన్‌స్టాగ్రామ్‌లో క్రియాశీలకంగా ఉంటున్నారని, ఫేస్బుక్, ట్విట్టర్ వంటివి పాతబడిపోతున్నాయని ఆయన అన్నారు. ఈ జెన్ జీ యుగంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోకపోతే వెనుకబడిపోతామని, కాబట్టి అందరూ ఇన్‌స్టాగ్రామ్‌లో చురుగ్గా ఉండాలని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు దిశానిర్దేశం చేశారు.
సాంకేతికతను అందిపుచ్చుకోవాలి
సాంకేతిక పరిజ్ఞానాన్ని ఒడిసిపట్టుకుని వినియోగించుకోకపోతే అవుట్‌డేట్ అయిపోతామని, సోషల్ మీడియా విస్తృతంగా వ్యాప్తి చెందుతోందని సీఎం రేవంత్ పేర్కొన్నారు. యువతరం ఎక్కువగా ఇన్‌స్టాగ్రామ్‌లో చురుగ్గా ఉంటున్న నేపథ్యంలో, ఆ వేదికపై పార్టీ కార్యకలాపాలను విస్తృతం చేయాలని ఆయన సూచించారు.












