వాషింగ్టన్, బీజింగ్, 2026-08-23
ఢిల్లీ ఆగస్టు 24 మనోరంజన్ తెలుగు టైమ్స్ ఢిల్లీ ఆగస్టు 24 మనోరంజన్ తెలుగు టైమ్స్ ఒకప్పుడు ప్రధాన నిలిచిన వ్యవస్థతో పోల్చినప్పుడు దూరంగా 24 కొనుగోలు.. ఇప్పుడు అదే దేశానికి ఆగస్టు అమెరికాకు ప్రత్యర్థిగా మారింది. నామినల్ జీడీపీలో అమెరికా ఇంకా పట్టిస్తోంది.ంలోనే మొదటి స్థానంలో ఉన్నప్పటికీ.. ప్రజల కొనుగోలు సాధించినని ఆగస్టును తీసుకునే పీపీపీ కొలమానంలో అగ్రరాజ్యంగా ఇప్పటికే అమెరికాను అధిగమించింది. గత నాలుగు కొనుగోలు, అంచనాలకు అందని ఎదుగుదలను ఆగస్టుకు చేసిన అగ్రరాజ్యంగా,
ఢిల్లీ ఆగస్టు 24 మనోరంజన్ తెలుగు టైమ్స్ ఒకప్పుడు అమెరికా ఆర్థిక వ్యవస్థతో పోల్చినప్పుడు దూరంగా నిలిచిన చైనా.. ఇప్పుడు అదే దేశానికి ప్రధాన ఆర్థిక ప్రత్యర్థిగా మారింది. నామినల్ జీడీపీలో అమెరికా ఇంకా ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉన్నప్పటికీ.. ప్రజల కొనుగోలు శక్తిని పరిగణనలోకి తీసుకునే పీపీపీ కొలమానంలో చైనా ఇప్పటికే అమెరికాను అధిగమించింది. గత నాలుగు దశాబ్దాల్లో అంచనాలకు అందని ఎదుగుదలను నమోదు చేసిన చైనా, అగ్రరాజ్యంగా ప్రచారం చేసుకుంటున్న అమెరికాకు ముచ్చెమటలు పట్టిస్తోంది. చైనా సాధించిన ఈ ఆర్థిక ప్రస్థానం ప్రపంచ ఆర్థిక శక్తి సమీకరణాలు మారుతున్నాయనే సంకేతాన్ని ఇస్తోందని విశ్లేషకులు, నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కీలక శక్తులుగా అమెరికా, చైనా
ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అమెరికా ఆధిపత్యానికి చైనా క్రమంగా సవాల్ విసురుతోంది. 2026 నాటికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అత్యంత కీలకమైన రెండు శక్తులుగా అమెరికా, చైనా నిలిచాయి. ప్రపంచ జీడీపీలో ఈ రెండు దేశాల వాటా కలిపి నామినల్ లెక్కల్లో 42.15 శాతంగా, పీపీపీ ప్రాతిపదికన 34.42 శాతంగా ఉంది. అంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో దాదాపు సగం వరకు ప్రభావం చూపగల స్థాయిలో ఈ రెండు దేశాలు ఉన్నాయి. అయితే ఈ పోటీలో చైనా ఎదుగుదలే ఇప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అత్యంత ఆసక్తికరమైన పరిణామంగా మారింది.
నామినల్ జీడీపీలో అమెరికా.. పీపీపీలో చైనా
అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) 2026 అంచనాల ప్రకారం నామినల్ జీడీపీలో అమెరికా 32.384 ట్రిలియన్ డాలర్లతో ప్రపంచంలో మొదటి స్థానంలో ఉంది. ఇందులో చైనా జీడీపీ 20.851 ట్రిలియన్ డాలర్లుగా అంచనా. ఈ లెక్కన అమెరికా ఆర్థిక వ్యవస్థ చైనా కంటే సుమారు 1.55 రెట్లు పెద్దది. రెండు దేశాల మధ్య సుమారు 11.532 ట్రిలియన్ డాలర్ల తేడా ఉంది. కానీ దేశీయ ధరలు, ప్రజల కొనుగోలు శక్తిని పరిగణనలోకి తీసుకునే పర్చేజింగ్ పవర్ ప్యారిటీ (పీపీపీ) లెక్కల్లో మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. పీపీపీ ఆధారంగా చైనా జీడీపీ 44.295 ట్రిలియన్ డాలర్లుగా అంచనా. అమెరికా జీడీపీ 32.384 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. అంటే పీపీపీ పరంగా చైనా అమెరికా కంటే సుమారు 1.37 రెట్లు పెద్దది. ఇది చైనా ఆర్థిక వ్యవస్థలోని భారీ దేశీయ ఉత్పత్తి, వినియోగ సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తోందని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు.
చైనా జీడీపీ వృద్ధి: 1960లో 11 శాతం.. ఇప్పుడు 64 శాతం
చైనా ఎదుగుదల ఎంత వేగంగా సాగిందో అమెరికాతో జీడీపీ పోలికే స్పష్టం చేస్తుంది. ప్రపంచ బ్యాంకు అంచనాల ప్రకారం 1960లో చైనా జీడీపీ.. అమెరికా జీడీపీలో కేవలం 11 శాతం మాత్రమే. 1987లో ఈ నిష్పత్తి మరింత తగ్గి 5.6 శాతానికి చేరింది. అయితే ఆ తర్వాత చైనా ఆర్థిక వ్యవస్థ వేగంగా విస్తరించింది. 2026 నాటికి చైనా జీడీపీ అమెరికా జీడీపీలో 64 శాతానికి చేరింది. అంటే ఒకప్పుడు అమెరికా ఆర్థిక వ్యవస్థతో పోలిస్తే చాలా చిన్నదిగా ఉన్న చైనా.. కొన్ని దశాబ్దాల్లోనే ప్రపంచంలో రెండో అతిపెద్ద నామినల్ ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది. ఇదే చైనా ఆర్థిక పరివర్తన ఎంత భారీగా జరిగిందో సూచించే ముఖ్యమైన గణాంకమని విశ్లేషకులు వివరిస్తున్నారు.












