బైంసాకు చెందిన ప్రముఖ కవి జాదవ్ పుండలిక్ రావు పాటిల్, గోదావరి గ్లోబల్ విశ్వవిద్యాలయం, రాజమహేంద్రవరంలో జూన్ 6, 7 తేదీలలో జరగనున్న ఏడవ ప్రపంచ సాహిత్య తెలుగు మహాసభలకు కన్వీనర్ గా నియమితులయ్యారు.
అంతర్జాతీయ సాహిత్య, సాంస్కృతిక సంస్థ శ్రీశ్రీ కళావేదిక ఆధ్వర్యంలో నిర్వహించబడే ఈ ప్రతిష్టాత్మక సభలకు ఆయనను కన్వీనర్ గా నియమిస్తూ జాతీయ అధ్యక్షురాలు జి. ఈశ్వరి భూషణం నియామక పత్రాన్ని పంపించారు.
తెలుగు భాషా సాహిత్యాల వికాసానికి జాదవ్ పుండలిక్ రావు పాటిల్ అందిస్తున్న విశేష సేవలకు గుర్తింపుగా ఈ నియామకం జరిగినట్లు భూషణం పేర్కొన్నారు.
ఈ నియామకంపై పలువురు సాహితీవేత్తలు, ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. కవులు గంగుల చిన్నన్న, బసవరాజు, పి. శ్రీనివాస్ గౌడ్, కడారి దశరథ్, కొండూరి పోతన, జాగిరి యాదగిరి, జె.డి.ఆర్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ అనిల్ కుమార్ జాదవ్ వంటివారు జాదవ్ పుండలిక్ రావు పాటిల్ ను అభినందించారు.










