బోథ్, సెప్టెంబరు 1, మనోరంజని తెలుగు టైమ్స్: యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి, లైబ్రరీలను సద్వినియోగం చేసుకోవాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సూచించారు. సోనాల మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన పుస్తక పఠన కేంద్రం (లైబ్రరీ), పోస్టాఫీసు భవనాలను మంగళవారం ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువత లైబ్రరీలోని పుస్తకాలను చదివి సాధారణ జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. అనవసరమైన అలవాట్లకు దూరంగా ఉంటూ, తమ భవిష్యత్తు లక్ష్యాల సాధనకు ఎక్కువ సమయం కేటాయించాలని ఆయన సూచించారు. పుస్తక పఠనం ద్వారా విజ్ఞానాన్ని పెంపొందించుకోవడంతో పాటు పోటీ పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించవచ్చని ఆయన పేర్కొన్నారు.
కార్యక్రమంలో మాజీ ఎంపీపీ తుల శ్రీనివాస్, సర్పంచుల సంఘం అధ్యక్షుడు స్వామి, స్థానిక సర్పంచ్ బిందుజా సుధీర్‌రెడ్డి, బీఆర్ఎస్ సోనాల పట్టణ అధ్యక్షుడు చిన్నయ్యతో పాటు మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.












