భైంసా మున్సిపాలిటీ నూతనంగా బాధ్యతలు స్వీకరించిన పాలక మండలి సభ్యులకు ప్రజా ట్రస్ట్ చైర్మన్ మోహన్రావు పటిల్ శుభాకాంక్షలు తెలిపారు. నూతన చైర్మన్, వైస్ చైర్మన్తో పాటు ఎన్నికైన వార్డ్ సభ్యులందరినీ ఆయన అభినందించారు.
ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ పారదర్శకంగా పనిచేసి, భైంసా పట్టణాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలని మోహన్రావు పటిల్ నూతన పాలక మండలికి సూచించారు. మౌలిక సదుపాయాల మెరుగుదల, పరిశుభ్రత, తాగునీరు, రహదారులు, ప్రజా సేవల విషయంలో మరింత శ్రద్ధ చూపాలని ఆయన కోరారు.
ప్రజల సమస్యలను ప్రాధాన్యతగా తీసుకొని వేగంగా పరిష్కరించడమే ప్రజాప్రతినిధుల ముఖ్య బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. ప్రజల ఆశలను నెరవేర్చుతూ మంచి పాలన అందించి, భైంసా మున్సిపాలిటీకి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా నూతన చైర్మన్ తుమొల్ల దతాత్రి, వైస్ చైర్మన్ ఇద్రిస్ బైగ్ మరియు ఎన్నికైన వార్డు సభ్యులందరికీ మోహన్రావు పటిల్ అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు.

