భైంసా, 28-07-2026
భైస ల వద్యధకర (ఎఈఓ) తకు సర్పచన ఫర్యదులపై చర్యలు తీసుకోకపోవన్న నరసస్తూ, సీఎవైఎస్ఎస్ జల్ల వర్కగ్ ప్రెసెట్ అరవద్ షతల్కర్, యూఎస్ఎఫ్ఐ జల్ల కర్యదర్శ నవీన్ నత్కర్ రష్ట్ర వద్యశఖ ఉన్నతధకరులను శఖపరైన వచరణకు, బధ్యులపై చర్యలకు కోరరు. వేద ఒలపయ్ వద్యసస్థపై అనుతులు, గుర్తపు, అధక ఫీజుల వసూళ్లపై ఫర్యదులు చేసన స్పదన లేదన వరు ఆరోపచరు.
భైంసా మండల విద్యాధికారి (ఎంఈఓ) తమకు సమర్పించిన ఫిర్యాదుపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం అత్యంత ఆందోళనకరమని, ఈ వ్యవహారంపై సమగ్ర శాఖాపరమైన విచారణ నిర్వహించి బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని సీఎవైఎస్ఎస్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అరవింద్ షితల్కర్, యూఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నవీన్ నమత్కర్ సంయుక్తంగా రాష్ట్ర విద్యాశాఖ ఉన్నతాధికారులను కోరారు.
జూలై 21/07/2026న భైంసా మండల విద్యాధికారికి వేదం ఒలింపియాడ్ విద్యాసంస్థకు సంబంధించిన ఫిర్యాదును సమర్పించినట్లు వారు తెలిపారు. సంబంధిత విద్యాసంస్థ అవసరమైన అనుమతులు, గుర్తింపులు లేకుండా నిర్వహించబడుతోందని, అధిక ఫీజులు వసూలు చేస్తోందని, విద్యాశాఖ నిబంధనలను ఉల్లంఘిస్తోందని ఫిర్యాదులో పేర్కొన్నామని వెల్లడించారు. అనంతరం జూలై 22/07/2026న జిల్లా విద్యాధికారి (డీఈఓ)కి కూడా ఫిర్యాదు సమర్పించినట్లు తెలిపారు.
అయితే, ఫిర్యాదు చేసినప్పటి నుంచి సంబంధిత అధికారుల నుంచి ఎలాంటి తనిఖీలు, విచారణ లేదా చట్టపరమైన చర్యలు చేపట్టకపోవడం విచారకరమని పేర్కొన్నారు. దీనివల్ల విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు ప్రజల్లో విద్యాశాఖ పనితీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని తెలిపారు.
అందువల్ల భైంసా మండల విద్యాధికారి వ్యవహారశైలిపై స్వతంత్ర శాఖాపరమైన విచారణ నిర్వహించాలని, విధుల నిర్వహణలో నిర్లక్ష్యం లేదా చట్టవిరుద్ధంగా వ్యవహరించినట్లు తేలితే సంబంధిత సర్వీస్ రూల్స్ ప్రకారం శాఖాపరమైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
అదేవిధంగా, వేదం ఒలింపియాడ్ విద్యాసంస్థపై ఉన్న ఆరోపణల నేపథ్యంలో ఉన్నతాధికారులతో ప్రత్యేక తనిఖీ బృందాన్ని ఏర్పాటు చేసి, సమగ్ర విచారణ నిర్వహించాలని కోరారు. విచారణలో నిబంధనల ఉల్లంఘనలు జరిగినట్లు తేలితే సంబంధిత విద్యాసంస్థపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు విద్యార్థుల ప్రయోజనాలను పరిరక్షించాలని విజ్ఞప్తి చేశారు.
విద్యా వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం, విద్యార్థుల హక్కుల పరిరక్షణ కోసం ప్రభుత్వం వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు కోరారు.












