బైంసా (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 19
భైంసా పట్టణంలో బోనాల పండుగను ప్రజలు ఆదివారం ఘనంగా జరుపుకున్నారు. గట్టు మైసమ్మ అమ్మవారి సన్నిధిలో భక్తుల సందడి నెలకొంది. ఈ సందర్భంగా ఆలయ రహదారి నిర్మాణానికి రూ. 65 లక్షల నిధులు మంజూరు చేస్తున్నట్లు ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ ప్రకటించారు.
భైంసా పట్టణంలో బోనాల పండుగను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. ఆదివారం ఉదయం వేళ నుండి గట్టు మైసమ్మ అమ్మవారి సన్నిధిలో భక్తుల సందడి కనిపించింది. గణేష్ నగర్, కిసాన్ గల్లీ, కోర్వగల్లీ, పలు కాలనీల నుండి ప్రజలు డప్పు చప్పులతో, బోనం కుండలతో అమ్మవారి చెంతకు చేరుకున్నారు.
ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వర్షాలు పుష్కలంగా కురవాలని, పంటలు బాగా పండాలని గట్టు మైసమ్మ తల్లిని మొక్కుకున్నట్లు ఆయన తెలిపారు.
గట్టు మైసమ్మ ఆలయ రహదారి నిర్మాణానికి 65 లక్షల రూపాయల నిధులను మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. వచ్చే ఆషాడం లోపు పనులను పూర్తి చేస్తామని చెప్పారు. అదేవిధంగా, షెడ్డు నిర్మాణానికి 10 లక్షల రూపాయల నిధులు మంజూరు చేస్తామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తుమొల్ల దత్తాత్రి, మాజీ మున్సిపల్ చైర్మన్ గంగాధర్, బిజెపి పట్టణ అధ్యక్షులు రావుల రాము, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.










