ఖానాపూర్, జూలై 20
ఖానాపూర్ పట్టణ గాయత్రి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో సోమవారం వరుణ పాశుపతి సహిత వరుణ హోమ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులు, ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఈ హోమం నిర్వహించారు.
సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులు, ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఖానాపూర్ పట్టణ గాయత్రి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో సోమవారం వరుణ పాశుపతి సహిత వరుణ హోమ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజల్లో నిర్మల్ జిల్లా డీసీసీ ఉపాధ్యక్షుడు, ఖానాపూర్ మాజీ మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
గాయత్రి బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు సందీప్ శర్మ మాట్లాడుతూ, వర్షాభావంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, సకాలంలో విత్తిన పంటలు ఎండిపోతున్నాయని, భూగర్భ జలాలు తగ్గిపోవడంతో బోరు బావులు కూడా పనిచేయడం లేదన్నారు.
రాష్ట్రంలో పుష్కలంగా వర్షాలు కురిసి, పాడి పంటలు సమృద్ధిగా పండాలని సంకల్పంతో వరుణ యాగాన్ని నిర్వహించినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు రాజు, రాఘవేంద్ర శర్మ, నిమ్మగడ్డ నాగరాజు, శరత్ తదితరులు పాల్గొన్నారు.











