నిర్మల్, 2026-06-05
పార్టీ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని, పార్టీ కోసం కష్టపడిన వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందని మాజీ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి అన్నారు. పార్టీలో క్రియాశీలకంగా పనిచేసే వారికి తగిన గౌరవం దక్కుతుందని ఆయన తెలిపారు.
పార్టీ కోసం పనిచేసిన వారికి గుర్తింపు: విఠల్‌రెడ్డి
పార్టీ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని మాజీ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి సూచించారు. పార్టీ కోసం కష్టపడిన వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందన్నారు. నూతనంగా ఎన్నికైన బాసర మండల కాంగ్రెస్ అధ్యక్షుడు అమృత్ పటేల్, మండల కార్యదర్శి జిడ్డు మల్లయ్య, ప్రధాన కార్యదర్శి డగే దిగంబర్, కార్యదర్శి రమేశ్ పటేల్‌ను దేగాంలోని తన నివాసంలో సన్మానించారు. బాసర సర్పంచ్ వెంకటేష్ గౌడ్, నాయకులు పాల్గొన్నారు.












