నిర్మల్ జిల్లాలోని దిలావర్పూర్ మండల కేంద్రానికి చెందిన చెన్నబోయిన అర్చన, ఇటీవల బార్ అసోసియేషన్ ట్రెజరర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ నాయకులు ఆమెను ఘనంగా సన్మానించారు.
ఈ సన్మాన కార్యక్రమంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ జిల్లా అధ్యక్షుడు యాటకారి సాయన్న ముదిరాజ్ మాట్లాడుతూ, అణగారిన వర్గాలకు న్యాయం చేయాలని అర్చనకు సూచించారు. భవిష్యత్తులో ఉన్నత పదవులు సాధించాలని ఆకాంక్షించారు.
మహాత్మా జ్యోతిరావు పూలే, డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా రాజ్యాంగ స్ఫూర్తితో అణగారిన వర్గాలకు అండగా నిలవాలని ఆయన కోరారు.
జేఏసీ రాష్ట్ర కమిటీ సభ్యుడు రామగిరి రవీందర్, జిల్లా సలహాదారు అడ్వకేట్ గొడుగు గంగాధర్, నాయకులు కల్లూరు సుధాకర్, చిట్యాల మహేందర్, ముత్యం, అనిల్, రాజేశ్వర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.












