బక్రీద్ పండుగ సందర్భంగా జిల్లాలో పశువుల అక్రమ రవాణాను అరికట్టేందుకు పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో గంజాల్ టోల్ ప్లాజా వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్ట్‌ను జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల, ఐపీఎస్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల, చెక్‌పోస్ట్ వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బందికి పలు కీలక సూచనలు చేశారు. వాహనాలను పూర్తిగా తనిఖీ చేయాలని, అనుమానాస్పద వాహనాలను ఆపి వాటి పత్రాలను సమగ్రంగా పరిశీలించాలని ఆదేశించారు. ముఖ్యంగా పశువుల రవాణాకు సంబంధించిన నిబంధనలు తప్పనిసరిగా పాటించేలా కఠినంగా వ్యవహరించాలని సూచించారు.
అక్రమంగా పశువుల రవాణాకు పాల్పడే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. చెక్‌పోస్టుల వద్ద 24 గంటల పర్యవేక్షణ కొనసాగిస్తూ ఎలాంటి అక్రమ కార్యకలాపాలకు అవకాశం లేకుండా అప్రమత్తంగా ఉండాలని సిబ్బందిని ఆదేశించారు. పశువుల అక్రమ రవాణాను అరికట్టడం ద్వారా చట్టాన్ని పరిరక్షించడంతో పాటు, పండుగ సందర్భంగా శాంతిభద్రతలను కాపాడటమే లక్ష్యంగా ఈ తనిఖీలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
ఈ ఆకస్మిక తనిఖీలో నిర్మల్ డిఎస్పీ శ్రీనివాస్ మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ప్రజలు కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.











