గుంటూరు, 2026-06-05
రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (అర్పిసి) ఆంధ్రప్రదేశ్ లీగల్ సెల్ చైర్మన్గా సీనియర్ న్యాయవాది, మాజీ గుంటూరు బార్ అసోసియేషన్ అధ్యక్షులు చెంగలశెట్టి వెంకట సత్యనారాయణను నియమించారు. అర్పిసి అధినేత మేడా శ్రీనివాస్ ఆదేశాల మేరకు, రెండు తెలుగు రాష్ట్రాల ఇంచార్జ్ పంగులూరి బుచ్చిబాబు ఈ నియామకాన్ని ప్రకటించారు.
అర్పిసి లీగల్ సెల్ చైర్మన్ గా " చెంగలశెట్టి " నియామకం .. ******************** రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ లీగల్ సెల్ చైర్మన్ గా సీనియర్ న్యాయవాది మాజీ గుంటూరు బార్ అసోసియేషన్ అధ్యక్షులు " చెంగలశెట్టి వెంకట సత్యనారాయణ " ను అర్పిసి అధినేత మేడా శ్రీనివాస్ ఆదేశాల మేరకు రెండు తెలుగు రాష్ట్రాల ఇంచార్జ్ పంగులూరి బుచ్చిబాబు ప్రకటించారు ..
న్యాయవాదులకు వృత్తి భద్రత , సంక్షేమం ఆవిరిగా మారుతుందని , ప్రభుత్వాలు న్యాయవాదుల భవిష్యత్ కోసం ఏ విధమైన మేలు చేయటం లేదని , న్యాయవాదుల మేధస్సు , వారి శ్రమ తో ప్రభుత్వానికి కోట్లలో ఆదాయ వనరులు సమాకూరుతున్నాయన్నారు . ప్రతి న్యాయవాది కృషి నేడు న్యాయశాఖ నిర్వహణలో ప్రముఖ పాత్రగా వుంటుందని , ప్రభుత్వం నుండి న్యాయవాదులకు వారి కుటుంబాలకు ఏ విధమైన ఆర్ధిక భరోసా , వ్యక్తిగత భద్రత లేకపోవటం బాదాకరం . న్యాయవాదులకు వారి కుటుంబాలకు ప్రైవేట్ కార్పొరేట్ వైద్య సేవలు 30 లక్షలు ఖర్చు వరకు ప్రభుత్వం ఉచితంగా భరయించే విధంగాను , ఏపి మొత్తంగా స్థానిక న్యాయవాదులకు ప్రభుత్వం నామ మాత్రపు అతిస్వల్ప ధరకే 500 చ. గ ఇంటి స్థలం ఇచ్చే విధంగాను, ప్రైవేట్ , కార్పొరేట్ విద్యా సంస్థల్లో 50% ఫీజు రాయితీ కల్పించే విధంగాను , ఉచితంగా టోల్ ప్లాజా సౌకర్యాన్ని కల్పించాలని అర్పిసి లీగల్ సెల్ అవిశ్రాంతంగా శ్రమిస్తుందన్నారు .
ఏపిలో గల అన్ని న్యాయస్థానాల్లో అర్పిసి లీగల్ సెల్ కమిటీ లను నియమించే విధంగా కృషి చేస్తానని , పార్టి అధ్యక్షులు మేడా శ్రీనివాస్ , రెండు రాష్ట్రాల ఇంచార్జ్ పంగులూరి బుచ్చిబాబు నాపై ఎంతో నమ్మకంతో నాకు ఈ బాధ్యతలు అప్పగించినందుకు వారికి ప్రత్యేక అభినందనలు తెలియ చేస్తు త్వరలో మరింతగా పార్టి ఆశయాల కోసం శ్రమిస్తానని ఏపి లీగల్ సెల్ చైర్మన్ గా నియమితులైన చెంగలశెట్టి వెంకట సత్యనారాయణ తెలిపారు ..
--చెంగలశెట్టి వెంకట సత్యనారాయణ , చైర్మన్ : ఆంధ్రప్రదేశ్ లీగల్ సెల్ , రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ..(గుంటూరు)












