నందిపేట్ (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 02
నందిపేట్ మండలంలోని అక్షర హైస్కూల్‌కు చెందిన 16 మంది విద్యార్థులు జాతీయ స్థాయి కురష్ క్రీడా పోటీలకు ఎంపికయ్యారు. సెప్టెంబర్ 5న పంజాబ్‌లోని లుధియానాలో ఈ పోటీలు జరగనున్నాయి. ఎంపికైన విద్యార్థులను పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు అభినందించారు.
*అక్షర స్కూల్ విద్యార్థులు జాతీయ స్థాయి కురష్ పోటీలకు ఎంపిక*
నందిపేట్ మండల కేంద్రంలోని అక్షర హైస్కూల్‌కు చెందిన 16 మంది విద్యార్థులు పంజాబ్‌లోని లుధియానాలో సెప్టెంబర్ 5న జరిగే జాతీయ స్థాయి కురష్ (Kurash) క్రీడా పోటీలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జాతీయ స్థాయికి ఎంపికైన క్రీడాకారులను యాజమాన్యం మరియు ఉపాధ్యాయ బృందం ఘనంగా అభినందించి, శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో అక్షర హైస్కూల్ ఛైర్మన్ డాక్టర్ శ్రీకాంత్ రామావత్, డైరెక్టర్ దివ్య రామావత్, కరస్పాండెంట్ తేజావత్ గంగాధర్, హెడ్ మాస్టర్ అందె మహేష్, వైస్ ప్రిన్సిపల్ శేఖర్ కొండూర్, కమల, ఫిజికల్ డైరెక్టర్ పన్నీరు శ్రీనివాస్, పీఈటీలు రామరాజు, గంగా జమున తదితరులు పాల్గొన్నారు.
జాతీయ స్థాయిలో తమ ప్రతిభను చాటి నందిపేట్ మండలానికి, పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని ఈ సందర్భంగా విద్యార్థులను కోరారు. 16 మంది విద్యార్థులు జాతీయ పోటీలకు ఎంపిక కావడం పట్ల నందిపేట్ ప్రజలు, ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తూ విద్యార్థులకు అభినందనలు తెలిపారు.












