ఆడెల్లి మహా పోచమ్మ ఆలయ ధర్మకర్తగా కొత్తపెళ్లి అనసూయ ప్రమాణ స్వీకారం
మనోరంజని తెలుగు టైమ్స్ సారంగాపూర్ ప్రతినిధి నవంబర్ 03
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రసిద్ధిగాంచిన నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని ఆడెల్లి మహా పోచమ్మ అమ్మవారి ఆలయానికి కొత్త ధర్మకర్తగా కొత్తపెళ్లి అనసూయ రాజేశ్వరరావు సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. దేవాదాయ శాఖ ఈవో భూమయ్య ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించగా, అనంతరం అనసూయ రాజేశ్వరరావు బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. స్థానిక ప్రజలు, నాయకులు కొత్త ధర్మకర్తకు అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, సారంగాపూర్ మార్కెట్ చైర్మన్ అబ్దుల్ హాదీ, నిర్మల్ మార్కెట్ చైర్మన్ భీమిరెడ్డి, మండల ప్రెసిడెంట్ బిల్లోజీ నర్సయ్య, వైస్ ప్రెసిడెంట్ కొత్తపల్లి విలాస్ రావు, పతి రాజేశ్వర్ రెడ్డి, అయిరా నారాయణ రెడ్డి, మాధవ్ రావు, మార్కెట్ డైరెక్టర్లు, టెంపుల్ డైరెక్టర్లు, మండల కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.