ఆంధ్రప్రదేశ్‌లో నేడు కొత్త మద్యం దుకాణాలు ప్రారంభం

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త మద్యం పాలసీ ప్రారంభం
  • ఏపీలో కొత్త మద్యం పాలసీ అమల్లోకి వచ్చింది.
  • లిక్కర్ షాపులు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు పనిచేస్తాయి.
  • ప్రభుత్వం డిజిటల్ పేమెంట్లను ప్రారంభించి నగదు సమస్యలను తగ్గించడానికి చర్యలు తీసుకుంది.
  • మద్యం విక్రయాలపై 2 శాతం సెస్ విధించి వచ్చిన ఆదాయాన్ని పునరావాస చర్యలకు వినియోగిస్తుంది.

 

ఆంధ్రప్రదేశ్‌లో నూతన మద్యం పాలసీ అమల్లోకి వచ్చింది. కొత్త పాలసీ ప్రకారం లిక్కర్ షాపులు ఉదయం 10 నుంచి రాత్రి 10 వరకు తెరవడానికి ప్రభుత్వం అనుమతించింది. మద్యం విక్రయాలపై 2 శాతం సెస్ విధించింది, ఈ ఆదాయాన్ని నార్కోటిక్ నియంత్రణ మరియు పునరావాస కార్యక్రమాలకు వినియోగిస్తారు. డిజిటల్ పేమెంట్ల ద్వారా చెల్లింపులు అందుబాటులోకి తెచ్చినట్లు ప్రభుత్వం ప్రకటించింది.

 

అమరావతి: అక్టోబర్ 16

ఆంధ్రప్రదేశ్‌లో నూతన మద్యం పాలసీ ఈ రోజు అమల్లోకి వచ్చింది. కొత్త పాలసీ ప్రకారం బుధవారం ఉదయం 10 గంటలకు వైన్ షాపులు తెరుచుకోగా, రాత్రి 10 గంటల వరకు ఈ షాపులు పనిచేయనున్నాయి. ఈ కొత్త విధానం ద్వారా లిక్కర్ షాపులలో డిజిటల్ పేమెంట్లను ప్రవేశపెట్టడం వల్ల నగదు చెల్లింపు సమస్యలకు చెక్ పెట్టినట్లు ప్రభుత్వం తెలిపింది.

మద్యం షాపుల కేటాయింపుకు సంబంధించి సోమవారం నాడు లాటరీ పద్ధతిలో ఎంపిక చేసిన 3,396 లైసెన్సులు కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రకటించారు. అయితే, కొన్ని చోట్ల మద్యం షాపుల విజేతలు బెదిరింపులకు గురయ్యారని, కొంతమంది కిడ్నాప్ అయ్యారని కూడా ప్రచారం ఉంది. సీఎం చంద్రబాబు ఈ ఘటనలను తీవ్రంగా పరిగణిస్తూ, మద్యం షాపుల నిర్వాహకులకు భయాలు లేకుండా పనిచేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

మద్యం విక్రయాలపై 2 శాతం సెస్ విధించిన ప్రభుత్వం ఈ ఆదాయాన్ని నార్కోటిక్ నియంత్రణ మరియు డీ-అడిక్షన్ పునరావాస కేంద్రాల ఏర్పాటుకు వినియోగించాలని ప్రకటించింది. ఈ విధానం ద్వారా మద్యం వినియోగం నియంత్రణకు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

Join WhatsApp

Join Now

Leave a Comment